News March 2, 2025
కొత్తగూడెం ఎయిర్పోర్ట్పై కనిపించని పురోగతి

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాశలవుతున్నాయి. ఇటీవల ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్లో ఎయిర్పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
సిరిసిల్ల: పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న జనం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. ఒక్కసారిగా పెరిగిన చలితో జనం వణుకుతున్నారు. చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలపై ప్రజలు దృష్టి సారించారు. వృద్ధులు, చిన్నపిల్లలు చలి మంటలు వేసుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్ ధరించడం ద్వారా కొంత ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో రాత్రివేళ రుద్రంగిలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, ఇల్లంతకుంటలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News November 16, 2025
సిరిసిల్ల: రబీలో లక్ష 94 వేల ఎకరాల్లో పంట సాగుకు అంచనా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రబీ సీజన్ (యాసంగి)లో సుమారు లక్ష 94 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1,83,000 ఎకరాల్లో వరి సాగుకు, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇందుకు గాను 45,312 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు.
News November 16, 2025
మరోసారి ఐపీఎల్కు సిక్కోలు యువకుడు

ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.


