News March 2, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై కనిపించని పురోగతి

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి-నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. ఇటీవల విడుదల చేసిన ఫలితాలలో ఆమె ప్రతిభ చాటారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించడం విశేషం. ఆమె నెలకు రూ.6వేల డాలర్ల పారితోషకం అందుకోనున్నారు.
News March 22, 2025
ఖమ్మం: రామయ్య తలంబ్రాలకు విశేష స్పందన: ATM రామారావు

ఈనెల 15 న ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా ప్రారంభించిన సీతరాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో ATM రామారావు తెలిపారు. ప్రారంభించిన వారం రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 బుకింగ్స్ అయినట్లు తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాల్సినవారు 151 రూపాయి చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే చేరుస్తామన్నారు.
News March 22, 2025
జూలూరుపాడు: ‘ఉపాధి కూలీలకు రూ.600 ఇవ్వాలి’

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం కింద రూ.600 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బానోతు ధర్మ డిమాండ్ చేశారు. జూలూరుపాడులో ఉపాధి పని ప్రదేశాలను సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు మజ్జిగ, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.