News March 6, 2025
కొత్తగూడెం: ఐటీఐ అప్రెంటిస్షిప్కు ఆహ్వానం

జిల్లాలోని వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ నోడల్ ఆఫీసర్ జి.రమేష్ తెలిపారు. ఐటీఐ పాసైన అభ్యర్థులు తమ అర్హత గల ధ్రువపత్రాలను ఈనెల 10వ తేదీన కొత్తగూడెం కళాశాలలో హాజరు కావాలని, అర్హత కలిగిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్లను తమ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
జగిత్యాల: ‘ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలి’

ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం మాల మహానాడు సమావేశం నిర్వహించారు. మాలల అస్థిరత్వంపై పోరాటం చేస్తూనే రాజ్యాంగ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నవంబరు 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అంజయ్య, రాజు, దేవయ్య, పురుషోత్తం పాల్గొన్నారు.
News September 16, 2025
ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.
News September 16, 2025
మార్కాపురం: రూ.25 వేల జీతంతో జాబ్స్

మార్కాపురంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 10 జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, పది నుంచి పీజీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు జీతం అందుతుందన్నారు.