News March 6, 2025
కొత్తగూడెం: ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌కు ఆహ్వానం

జిల్లాలోని వివిధ పరిశ్రమలలో అప్రెంటిస్‌షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ నోడల్ ఆఫీసర్ జి.రమేష్ తెలిపారు. ఐటీఐ పాసైన అభ్యర్థులు తమ అర్హత గల ధ్రువపత్రాలను ఈనెల 10వ తేదీన కొత్తగూడెం కళాశాలలో హాజరు కావాలని, అర్హత కలిగిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్‌లను తమ వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News April 12, 2026
కర్నూలు: యవకుడు, మహిళ సూసైడ్

కర్నూలు(D) దేవనకొండ మండలానికి చెందిన మహిళ, యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నారు. అలారుదిన్నెకు చెందిన రంగస్వామి(21), ఉరుకుందకు చెందిన ప్రమీల(23) దంపతులమని చెప్పి 2 నెలల క్రితం కడప(D) ప్రొద్దుటూరు(M) లింగాపురంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రంగస్వామి చదువుతుండగా, ప్రమీలకు ఇదివరకే వేరే వ్యక్తితో వివాహమైంది. భర్తకు దూరంగా ఉంటూ పిల్లలతో కలిసి రంగస్వామితో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ ఉరేసుకున్నారు.
News April 12, 2026
VJA: టాయిలెట్‌లో కన్నబిడ్డను వదిలి వెళ్లిన సాఫ్ట్‌వేర్ దంపతులు!

విజయవాడ కృష్ణలంక మున్సిపల్ టాయిలెట్స్‌లో ఓ మహిళ <<19626479>>ఆడపిల్లకు జన్మనిచ్చి వదిలేసిన ఘటన <<>>తెలిసిందే. గోదావరి జిల్లా దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ బాయ్, స్వీపర్‌గా పని చేస్తూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతో బిడ్డను పెంచలేక బస్ స్టాండ్ నుంచి టాయిలెట్‌కు వెళ్లి డెలివరీ చేసి వదిలేశారు. సీసీ కెమెరాల సాయంతో పోలీసులు అరెస్టు చేశారు. పాప ఆసుపత్రిలో ఆరోగ్యంగా ఉంది.
News April 12, 2026
బాపట్ల: దారుణం.. అర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ హత్య?

బాపట్ల (D) అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోరం జరిగింది. RMP డాక్టర్ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే సీఐ సుబ్బరాజు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


