News May 3, 2024

కొత్తగూడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

image

బూర్గంపాడు మండలం సారపాకలో కుటుంబ కలహాల నేపథ్యంలో అమర్ జీవ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 16, 2025

ఖమ్మం: అడవి పంది మృతి.. ముగ్గురిపై కేసు

image

వేంసూరు మండలం ఎర్రగుంటపాడులో వరి పొలంలో పురుగు మందు పిచికారి చేయగా, ఆ నీరు తాగి ఓ అడవి పంది మృతి చెందింది. ఈ కళేబరాన్ని ఆయిల్‌పామ్ తోటలో పోగులు వేస్తున్న వాసం రామకృష్ణ, వాసం వెంకటేశ్వరరావు, చిలక సాయిపై వైల్డ్‌ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఓ నర్సింహ్మ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని, అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 16, 2025

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం: సీపీ

image

ఫ్లాగ్ డేను పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ కు రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఇటీవల కాలంలో తీసిన (3) ఫోటోలు, 3 ని.లు గల షార్ట్ ఫిలిమ్స్ తీయాలని చెప్పారు. ఈనెల 22లోపు పోలీస్ కమిషనరేట్లో షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, ఫొటోలు అందజేయాలన్నారు.

News October 16, 2025

రోడ్ల మరమ్మతుల వేగవంతం చేయండి: ఖమ్మం కలెక్టర్‌

image

జిల్లాలో రోడ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అధికారులతో సమీక్షలో మాట్లాడారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల గుంతలు, మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ప్రవేశ, నగర ప్రవేశాల సుందరీకరణ, నేమ్‌ బోర్డులు, విద్యుత్ స్తంభాల తరలింపును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.