News May 3, 2024
కొత్తగూడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
బూర్గంపాడు మండలం సారపాకలో కుటుంబ కలహాల నేపథ్యంలో అమర్ జీవ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2024
ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన మంత్రి పొంగులేటి
HYDలోని రాజ్ భవన్లో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలతో కూడిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
News November 13, 2024
KMM: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని అన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు.
News November 13, 2024
భద్రాద్రి రామయ్య దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదపండితుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.