News March 28, 2024
కొత్తగూడెం: కోతులను తరిమికొట్టేందుకు గొరిల్లాగా మారింది

కొత్తగూడెం జిల్లాలో కోతులను తరిమికొట్టేందుకు అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామస్థులు.. గ్రామపంచాయతీ కార్యదర్శి భవానీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో గొరిల్లా దుస్తులు కొనుక్కుని రెండుసార్లు గ్రామం, వ్యవసాయ పొలాల్లో తిరిగింది. కోతులు ‘గొరిల్లా’కు భయపడి సమీపంలోని అడవుల్లోకి పారిపోయాయి. గత వారం రోజులుగా ఈ ఆలోచనను అమలు చేస్తున్నామని, చాలా వరకు కోతులు గ్రామాన్ని వదిలి వెళ్లాయన్నారు.
Similar News
News March 17, 2026
ఖమ్మం రైల్వే పనుల్లో జాప్యం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘అమృత్ భారత్’ పథకం కింద రూ. 25.41 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనీస సౌకర్యాలు లేక, మూడో లైను ప్లాట్‌ఫాం నిర్మాణం పూర్తికాక రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 2026 గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News March 17, 2026
ఖమ్మం: ALERT.. రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

జిల్లాలోని SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు మీసేవలో లేదా tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు 60-90% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ప్రధానంగా 2 వీలర్, 3 వీలర్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
# SHARE IT