News May 4, 2024
కొత్తగూడెం చేరుకున్న సీఎం రేవంత్

ఖమ్మం పార్లమెంట్ ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడేనికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం కొద్దిసేపటి క్రితం ప్రగతి మైదాన్లో దిగారు. ప్రకాశం స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభా స్థలికి చేరుకున్నారు.
Similar News
News January 9, 2026
సత్తుపల్లి జిల్లా ఆశలు.. మంత్రి పొంగులేటిపైనే..!

1997లో మొదలైన సత్తుపల్లి జిల్లా ఉద్యమం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నాటి ఉద్యమ సారథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రాష్ట్ర మంత్రిగా ఉండటంతో జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. నాడు జిల్లా ఆవశ్యకతపై ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తున్నారు. ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ ‘తీపి కబురు’ ఎప్పుడు వింటామా స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో మితిమీరుతున్న ప్రైవేటు ఫైనాన్స్ ఆగడాలు..!

ఖమ్మం జిల్లాలో ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని ‘రోజులు’, ‘వారాల’ వడ్డీల పేరుతో రక్తాన్ని పీల్చుతున్నారు. అప్పుతీర్చడం ఆలస్యమైతే అధిక వడ్డీలు, వేధింపులతో బెంబేలెత్తిస్తుండటంతో సామాన్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దోపిడీపై అధికారులు స్పందించి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పేదలను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు.
News January 9, 2026
ఖమ్మం: సంక్రాంతి వేళ తస్మాత్ జాగ్రత్త: సీపీ

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.


