News August 8, 2024
కొత్తగూడెం: జడివానలో జడ్డీపై నిండు గర్భిణి
స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా కొత్తగూడెం జిల్లాలో రోడ్ల దుస్థితి మాత్రం దారుణంగానే ఉంది. గర్భిణీలను ఇంకా జడ్డీపైనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని జడ్డీలో దవాఖానకు తరలించిన ఘటన భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో జరిగింది. 3 కిలోమీటర్లు ఆమెను జడ్డీపై మోస్తూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 18, 2024
ఖమ్మం: మిర్చి @ రూ.20,000
వరుస సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. బుధవారం మార్కెట్లో మిర్చి ధర క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు తెలిపారు.
News September 18, 2024
కరకగూడెం:భార్యతో గొడవ.. భర్త సూసైడ్
భార్యతో గొడవపడి పురుగులు మందు తాగి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకొని మృతిచెందిన ఘటన కరకగూడెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కోవాసి సురేశ్ తన భార్యతో గొడవపడి మనస్తాపం చెంది మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.
News September 18, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
>ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: అదనపు కలెక్టర్
>ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి పొంగులేటి
> ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోంది: మంత్రి తుమ్మల
>దళితబంధు చెక్కులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
> పాల్వంచ:గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని
> వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ