News April 7, 2025

కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

image

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.

Similar News

News November 28, 2025

HYD: నూతన అధ్యాయానికి జలమండలి గ్రీన్ సిగ్నల్..!

image

HYDలో నీటి సరఫరా వ్యవస్థలో నష్టాలను తగ్గిస్తూ, నీటి నాణ్యతను మెరుగుపరచేందుకు నూతన టెక్నాలజీకి HMWSSB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి వినియోగదారుని వరకు రియల్‌టైమ్ పర్యవేక్షణ కోసం రా వాటర్ పంపింగ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, రిజర్వాయర్లను పరిశీలించే వ్యవస్థను ప్రస్తుత స్కాడాతో అనుసంధానం చేసే సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేయాలని ఆదేశించారు.

News November 28, 2025

MHBD: పాత బిల్లులు రాలే.. పోటీ చేయాలా? వద్దా?

image

గత ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచులకు ప్రభుత్వం మారినా ఇప్పటికీ అభివృద్ధి పనుల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసొచ్చిన నాయకులు మళ్లీ పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండిపోయారు. పోటీ చేస్తే ఖర్చుపెట్టినా మళ్లీ గెలుస్తామో? గెలవమో? అని నాయకులు జంకుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 482 పంచాయతీలు ఉన్నాయి.

News November 28, 2025

గట్టుప్పల్: అక్కడ ఓటు వేయాలంటే.. 3 కిలోమీటర్లు నడవాల్సిందే!

image

గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని రంగంతండా, అజనాతండా, దేవులతండా, రాగ్యాతండాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. సుమారు 3 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నాలుగు తండాల్లో సుమారు 650 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.