News October 15, 2024
కొత్తగూడెం జిల్లాలో యువకుడి ఆత్మహత్య
ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి, చికిత్సపొందుతూ మృతిచెందిన ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం వెంకటాపురం పరిధి పాలగుంపు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొక్కటి కోస(31) ఈనెల 9న కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఖమ్మంలో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 12, 2024
ఖమ్మం: గ్రూప్-3 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలు సిద్ధం
ఖమ్మం జిల్లాలో నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ సూచించారు. 27,984 అభ్యర్థుల కోసం 87 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష సజావుగా జరిగేందుకు, ప్రశ్నాపత్రాలు భద్రతతో కేంద్రాలకు చేరవేసి, ప్రతి 3-5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ నియమించామన్నారు. సిబ్బందికి పరీక్షల పట్ల పూర్తి అవగాహనను కల్పించారు.
News November 12, 2024
ఖమ్మం: సొంత నివాసాలు లేని మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.
News November 12, 2024
ఖమ్మం మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రామసహాయం రాధికను ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ నియమించారు. కైకొండాయిగూడెంకు చెందిన రామసహాయం నిర్మల, బుచ్చిరెడ్డి కూతురు రాధిక. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె చేసిన సేవాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.