News March 4, 2025
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు

కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
Similar News
News November 15, 2025
రెబ్బెన: యాక్సిడెంట్.. కానిస్టేబుల్ మృతి

రెబ్బెన మండలం కైరిగాం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిర్యానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ రాము శనివారం ఉదయం మృతి చెందినట్లు రెబ్బెన SI వెంకటకృష్ణ తెలిపారు. ఈ నెల 13న కైరిగాం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాము తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు SI వెల్లడించారు.
News November 15, 2025
యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

భారతదేశంలో సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కొత్తగూడెంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, బీజేపీ మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
News November 15, 2025
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్

తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.


