News March 4, 2025

కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

Similar News

News March 17, 2025

కొత్త ఏడాది రాశిఫలాలు..

image

ఈ నెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాది పంచాంగంలో రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇలా ఉన్నాయి. కన్య, మిథునం రాశుల వారికి ఆదాయం ఎక్కువ. వీరికి 14 ఆదాయం, వ్యయం 2గా ఉంది. మేషం, వృశ్చికం రాశులవారికి 2మాత్రమే ఆదాయం ఉండగా, వ్యయం మాత్రం 14గా ఉంది. మేష రాశి వారికి అత్యధికంగా అవమానం 7గా ఉంది. కర్కాటకం, కుంభం రాశులవారికి రాజపూజ్యం 7గా ఉంది. మీరూ చెక్ చేసుకోండి.

News March 17, 2025

పోసాని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: పోసాని కృష్ణమురళికి ఒక రోజు CID కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై CID కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్‌ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.

News March 17, 2025

ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేడ్చల్ కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలోని శాఖల వారీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ధి చేకూరుతుందనే జాబితాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పరిశీలించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్‌లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంల లబ్ధి చేకూరుతుందని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!