News November 2, 2024
కొత్తగూడెం: తండ్రిని చంపిన కుమారుడు

మణుగూరు పగిడేరు ఎస్టీ కాలనీకి చెందిన కుంజా భీమయ్యను (59) తన కొడుకు కుంజా రాములు శుక్రవారం రాత్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. పోలీసులు వివరాలిలా.. మద్యం మత్తులో ఉన్న రాములు కర్రతో భీమయ్య తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భీమయ్యను ఆస్పత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్కుమార్, రాజ్బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్గఢ్కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
News December 5, 2025
ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్ క్రాస్ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.


