News February 2, 2025
కొత్తగూడెం: దివ్యాంగులకు శుభవార్త.. గడువు పొడిగింపు

దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పొడిగించారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత తెలిపారు. ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి జిల్లాలోని దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2025
SSMB29 రెండో షెడ్యూల్ షురూ

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ చిత్రం SSMB29 షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోదరుడి వివాహం కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ వేసవిలో విదేశాల్లో షూటింగ్‌కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
News February 18, 2025
నంద్యాల జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే నంద్యాలలో ఆదివారం, సోమవారం వరుసగా 37.23°, 37.22° ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీటితో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
News February 18, 2025
మేడ్చల్: క్రమశిక్షణ చర్యలు.. MRO బదిలీ

మేడ్చల్ MRO శైలజ బదిలీ అయ్యారు. ఆమెను నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గౌతమ్ సూచనల మేరకు క్రమశిక్షణ చర్యల కింద ఆమెను బదిలీ చేసినట్లుగా పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె బదిలీపై ఊహాగానాలు జోరందుకోగా చివరకు FEB 8 తేదినే ఆమె బదిలీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆమె వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.