News August 5, 2024
కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన

అశ్వాపురం మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 48 మంది విద్యార్థులకు ఏకైక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య బోధన అందడం లేదని అన్నారు. కావున మండల అధికారులు స్పందించి, పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News July 5, 2025
38 సబ్ స్టేషన్లలో RTFMS పనులు పూర్తి: ఖమ్మం SE

వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (RTFMS) ఎంతగానో దోహదపడుతుందని ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి అన్నారు. శనివారం ఎన్పీడీసీఎల్ పరిధిలో 100 సబ్ స్టేషన్లను గుర్తించామని, సర్కిల్ పరిధిలో 38 సబ్ స్టేషన్లలో RTFMS పనులు జరుగుతున్నాయని వివరించారు. మిగతా సబ్ స్టేషన్లలో కూడా త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.