News March 3, 2025
కొత్తగూడెం: పీడీఎస్‌యూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నేడు ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థ ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. కొత్తగూడెం కార్యాలయంలో సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రాజేశ్, సహాయ కార్యదర్శిగా వెంకటేశ్, కోశాధికారిగా భాస్కర్‌తో పాటు 11 మంది కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు.
Similar News
News November 1, 2025
మనకోసం మొదట దీక్ష చేశారు.. కానీ మనమే మరిచాం.!

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబర్ 1న 1956 జరుపుకుంటాం. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు. అయితే ఆయన కన్నా ముందు 1952లో స్వామి సీతారాం(గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. స్వామి సీతారాం దీక్ష 35 రోజుల తర్వాత విరమించగా, పొట్టి శ్రీరాములు 56 రోజుల దీక్ష తర్వాత మరణించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమయ్యారు.
News November 1, 2025
BREAKING: HYD: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మహిళపై అత్యాచారం

HYD అమీర్‌పేట్ పరిధిలో ఈరోజు దారుణం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై GHMC పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు ఏడుస్తూ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.