News April 24, 2024
కొత్తగూడెం: పురుగుల మందుతాగి నవ వధువు సూసైడ్

తల్లి అనారోగ్యం సాకుగా చూపి చదువు మాన్పించి పెళ్లి చేశారని నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఎస్ఐ మాచినేని రవి తెలిపిన కథనం ప్రకారం.. చంద్రుగొండ మండలం
మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శ్రీను, పద్మ దంపతుల కుమార్తె భూక్య దేవకి(23) డిగ్రీ పూర్తి చేసింది. పైచదువులకు వెళ్తానని పట్టుబట్టింది. బలవంతంగా పెళ్లి చేయడంతో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 6, 2025
సేంద్రియ సాగు శిక్షణకు వంద మంది రైతులు: మంత్రి తుమ్మల

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సేంద్రియ సాగు ప్రోత్సాహంపై ఏపీలోని పినగూడూరు లంకలో జరగనున్న శిక్షణ శిబిరానికి ఖమ్మం జిల్లా నుంచి 100 మంది రైతులను పంపాలని మంత్రి ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతినిధులు కోరారు.

News December 5, 2025
‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.