News March 11, 2025

కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

Similar News

News December 13, 2025

Stay Safe: రేపు, ఎల్లుండి కోల్డ్ వేవ్స్

image

తెలంగాణలో రేపు, ఎల్లుండి చలి తీవ్రత మరింత పెరగనుందని IMD తెలిపింది. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ తీవ్రమైన శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయంది. TGలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో ప్రజలు బయటికి రావద్దని హెచ్చరించింది.

News December 13, 2025

కాసేపట్లో ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ

image

హైదరాబాద్ వచ్చిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ప్రస్తుతం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి బయల్దేరుతారు.

News December 13, 2025

రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.