News February 18, 2025

కొత్తగూడెం: ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించండి: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

Similar News

News November 1, 2025

పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

image

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.

News November 1, 2025

వరంగల్ కబ్జాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

image

వరంగల్ వరదల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నాళాలపై కబ్జాలు చేసిన వారిని ఎంత పెద్దవారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఇరిగేషన్ శాఖతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వదలాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు.

News November 1, 2025

IPL: LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?

image

IPL-2026లో LSG హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్‌లో LSG కోచ్‌గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్‌ను స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించింది.