News February 18, 2025
కొత్తగూడెం: ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించండి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
Similar News
News March 19, 2025
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించండి: కలెక్టర్

జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు.
News March 19, 2025
300 సీసీ కెమెరాలు వితరణ.. జ్ఞాపికలు అందజేసిన ఎస్పీ

రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ సీసీ కెమేరాలను మొబిస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు జిల్లా ఎస్పీ జగదీశ్ సమక్షంలో ఆత్మకూరు పోలీసులకు అందజేశారు. దాతలైన హ్యుండాయ్ మొబీస్ కంపెనీ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. ఆత్మకూరు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
News March 19, 2025
జ్యోతి క్షేత్రమును సందర్శించనున్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి బుధవారం శ్రీ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రమును సందర్శించనున్నారు. జ్యోతి క్షేత్రములో కాశినాయన స్వామిని దర్శించుకొని అనంతరం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన వసతి భవనాలను, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పునఃనిర్మించిన భవనాలను పరిశీలించనున్నారు.