News March 30, 2024
కొత్తగూడెం: ప్రేమ పేరుతో మోసం.. బాలికకు గర్భం

బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి, గర్భవతిని చేసిన వ్యక్తిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. ములకలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను సమీప గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో కుటుంబీకులు ఆరా తీయగా, గర్భవతైన విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 22, 2025
PHCలలో అరకొర సేవలు.. ప్రజలకు రేబిస్ టీకా కష్టాలు

ఖమ్మం జిల్లాలోని 22 PHCలు,3 బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా రేబిస్ వ్యాక్సిన్ వంటి అత్యవసర మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. గర్భిణులకు టెక్నీషియన్, వసతులు లేక జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నారు. సేవలు లేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.
News November 22, 2025
‘రాంగ్‌రూట్’ అత్యంత ప్రమాదకరం: సీపీ సునీల్ దత్

రాంగ్‌రూట్‌లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. కొద్దిపాటి దూరం కోసం కూడా రాంగ్‌రూట్‌ను ఆశ్రయించవద్దన్నారు. ‘మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది’ అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సరైన మార్గంలో ప్రయాణించి, క్షేమంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
News November 22, 2025
బోనకల్‌లో నిలిచిన ఉచిత సౌర విద్యుత్ పనులు

మధిర నియోజకవర్గం బోనకల్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ, పనులు నిలిచిపోవడంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. మండలంలోని 22 గ్రామాల్లో అధికారులు గతంలో 15 రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. అయితే, సర్వే పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటికీ సోలార్ పరికరాలు అమర్చలేదు. దీంతో ఈ పథకం ఎప్పుడు అమలవుతుందో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


