News February 11, 2025

కొత్తగూడెం బస్ డిపో వద్ద మృతదేహం కలకలం 

image

కొత్తగూడెం బస్ డిపో వద్ద గుర్తుతెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని 1 టౌన్ పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తికి 45 ఏళ్ల వయసు ఉంటుందని, తెల్ల గీతలు ఉన్నచొక్క, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. మనిషి నలుపు రంగులో ఉన్నాడని, చనిపోయి ఉన్న ఆ వ్యక్తికి సంబంధించి ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కోరారు. వన్ టౌన్ సీఐ 8712682017, ఎస్ఐ 8712682019 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News March 24, 2025

మిస్‌ తెలుగు USA ఫైనలిస్ట్‌లో ఖమ్మం జిల్లా యువతి

image

మిస్‌ తెలుగు USA – 2025 పోటీల్లో బోనకల్‌ మం. ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్‌కు చేరింది. అమెరికాలో స్థిరపడి చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు. తెలుగుభాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి తదితర అంశాలతో విజేతను ఎంపిక చేస్తారు. ఫినాలే మే25న డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముష్టికుంట్లకు చెందిన శివనర్సింహారావు-మాధవి దంపతుల కుమార్తె గీతిక.

News March 24, 2025

నరసరావుపేట: సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు 

image

వివిధ రకాల కార్పొరేషన్‌ కింద స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువు పెంచినట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. 2024-25 సంవత్సరంలో బీసీ, కాపు, ఈ బీసీ, తదితర అన్ని కార్పొరేషన్‌కి సంబంధించిన సబ్సిడీ రుణం మంజూరు కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. B.C, E.W.Sలో ఉన్న ఏడు కార్పొరేషన్‌ల లబ్ధిదారుల కోసం స్వయం ఉపాధి పథకాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 

News March 24, 2025

జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!