News July 30, 2024
కొత్తగూడెం: బాలికను వేధిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామ ముసుగులో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. ఇల్లందు పట్టణంలోని గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 13, 2024
కల్లోజి జయమ్మ మృతి పట్ల ఎంపీ సంతాపం
సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
News October 13, 2024
త్వరలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు: డీప్యూటీ సీఎం భట్టి
రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు.
News October 12, 2024
కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పండుగ వేళ కొత్తగూడెం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలిలా.. కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులలో ఒకరిని రేగళ్లకు చెందిన డోలు భద్రుగా గుర్తించారు. మరొకరిది చత్తీస్ గఢ్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.