News February 20, 2025
కొత్తగూడెం: భార్య మృతి.. కళ్లు డొనేట్ చేసిన భర్త

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని సీతారాంనగర్ కాలనీలో నివాసం ఉండే మోర్తాల కళావతి(55) బుధవారం అనారోగ్యంతో మృతిచెందింది. కాగా మరొకరికి చూపు ఇవ్వాలనే ఉద్దేశంతో కళావతి రెండు నేత్రాలను హైదరాబాద్‌కు చెందిన అగర్వాల్ ఐ బ్యాంక్ సంస్థ రిప్రజెంటేటివ్ జానీకి ఆమె భర్త సీతారాంరెడ్డి అందజేశారు. పలువురు సీతారాం రెడ్డిని అభినందించారు.
Similar News
News March 18, 2025
సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. ఇల్లంతకుంట 40.9°c, కోనరావుపేట 40.7 °c,గంభీరావుపేట 40.3°c, చందుర్తి 45.3°c, బోయిన్పల్లి 40.3°c, వీర్నపల్లి 39.9 °c,రుద్రంగి 39.5°c, తంగళ్ళపల్లి 39.4 °c, లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇల్లంతకుంట, కోనరావుపేట మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది.
News March 18, 2025
ఒక్క హామీ నెరవేర్చితే బాధ్యత తీరిపోయినట్టు కాదు: మంత్రి లోకేశ్

ఒక హామీ నెరవేర్చితేనే నా బాధ్యత తీరిపోయినట్టు కాదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం చేనేతలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీ లక్షలాదిమంది ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఎంతో దోహదపడుతుందని అందులోనే తనకు సంతోషం ఉందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు.
News March 18, 2025
సిద్దిపేట జిల్లా ప్రజలారా.. జర జాగ్రత్త

సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఎండ తీవ్రత, వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావొద్దని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటూ నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకొని, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.