News March 31, 2024

కొత్తగూడెం: మటన్ కోసం గొడవ.. బయటపడిన బాల్యవివాహం 

image

ఓ వివాహ విందులో చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా బాల్య వివాహ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు ఈనెల 27వ తేదీన యువకుడితో పెళ్లి జరిగింది. శుక్రవారం రిసెప్షన్ జరుగుతుండగా విందుకు హాజరైన ఓ యువకుడు మాంసం వేయలేదని గొడవకు దిగాడు. ఈ గొడవలో పెళ్లి కుమార్తె మైనర్ అని తేలడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో ఏఎస్సై రెహమాన్ కేసు నమోదు చేశారు.

Similar News

News September 30, 2024

ఖమ్మం: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
ఖమ్మం 2938 321 1: 09
భద్రాద్రి 2414 260 1:10

News September 30, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} కరకగూడెంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News September 30, 2024

ఖమ్మం: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

KMM- NLG- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.