News October 23, 2024

కొత్తగూడెం: మద్యం దుకాణం వద్దంటూ వినతి

image

చింతూరు మండలం చట్టి గ్రామ ప్రధాన రహదారిపై మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో ప్రధానంగా నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య వస్తుందన్నారు. ఈ ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ఆరోపించారు. వైన్ షాపు పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. 

Similar News

News November 6, 2024

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 6, 2024

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ 

image

ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మద్దతు ధరకే నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కె.సురేంద్ర మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.

News November 5, 2024

కొత్తగూడెం: ఫుడ్ డెలివరీ బాయ్ సూసైడ్ 

image

కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.