News March 21, 2025
కొత్తగూడెం మహిళా రైతులకు గుడ్ న్యూస్..!

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో అందజేస్తున్నట్లు కొత్తగూడెం మండల వ్యవసాయ శాఖ సంచాలకులు ప్రకటన ద్వారా తెలిపారు. మహిళ రైతులకు సబ్సిడీలో పనిముట్లను అందించడం జరుగుతుందని ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాటరీ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్, గట్లు వేసే యంత్రం, ట్రాక్టర్ పనిముట్లు, రోటవేటర్లు, సీడ్ డ్రిల్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, పవర్ వీడర్ అందిస్తున్నట్టు చెప్పారు.
Similar News
News December 5, 2025
నా ఓరుగల్లు.. కాకతీయులు ఏలిన నేల!

కాకతీయులు ఏలిన ఓరుగల్లు గడ్డపై పుట్టిన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ నేలను మర్చిపోరు. ఈ నేలపై ఓరుగల్లు ప్రజలు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఎక్కడ కలుసుకున్నా జిల్లా బంధం ఇట్టే కలిపేస్తుంది. ఎక్కడున్నా ఓరుగల్లు భాష దగ్గరికి చేరుస్తుంది. అంతేకాదు.. ఓరుగల్లును, పంట భూములను భద్రకాళి, సమ్మక్క-సారలమ్మ, రుద్రేశ్వర స్వామి వార్లే కాపాడతారని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. నేడు ప్రపంచ నేల దినోత్సం. SHARE
News December 5, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 5, 2025
నల్గొండ: కబడ్డీ అసోసియేషన్లో లుకలుకలు!

నల్గొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్లో లుకలుకలు బయటపడ్డాయి. కబడ్డీ అసోసియేషన్లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగి పెత్తనం చెలాయించడంపై అసోసియేషన్ మండిపడుతోంది. జిల్లా కమిటీ సభ్యులకు తెలియకుండానే జిల్లా కబడ్డీ అసోసియేషన్ పేరుతో ఈనెల 2, 3, 4వ తేదీల్లో హాలియాలో 51వ అంతర్ జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. హాలియాలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు కబడ్డీ అసోసియేషన్తో సంబంధం లేదని సభ్యులు తెలిపారు.


