News January 29, 2025

కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో 6 నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 3, 2025

వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి: కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News December 3, 2025

GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

image

TG: గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్‌లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.

News December 3, 2025

అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి

image

కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రజా పాలన సభలో మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతోనే నేటికీ తెలంగాణ ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వైఫల్యమైందని విమర్శించారు.