News January 29, 2025
కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీలకు ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలానికి తెరపడిన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో 6 నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News February 8, 2025
కేజ్రీవాల్ ఓటమికి 2 కారణాలు: పీసీసీ చీఫ్

BRSతో స్నేహం, కాంగ్రెస్‌తో పొత్తు తెంచుకోవడం వల్లే ఆప్ ఓడిపోయిందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కూతురు కవితతో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు కేజ్రీవాల్ పతనానికి పునాదులు వేశాయని చెప్పారు. అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశస్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారని, కానీ లిక్కర్ స్కాం దానికి తూట్లు పొడిచిందన్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తు వద్దన్న ఆయన నిర్ణయం బీజేపీ నెత్తిన పాలు పోసిందని పేర్కొన్నారు.
News February 8, 2025
టెన్త్ అర్హతతో 1,124 ఉద్యోగాలు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 1,124 ఖాళీలకు మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులున్నాయి. టెన్త్ పాసై డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 21-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది.
వెబ్‌సైట్: <