News April 16, 2025
కొత్తగూడెం: యువతిని మోసం చేశాడు

కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన ఏసుదాస్ డేవిడ్(43) పెళ్లి చేసుకుంటా అని యువతిని(21) గర్భవతి చేశాడు. సీఐ జె.ఉపేందర్ వివరాలు.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ శారీరికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 11, 2025
VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.
News November 11, 2025
గోదావరిఖనిలో బయటపడ్డ అష్టభుజాల సింహవాహిని

రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్ ప్లాంట్ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. విగ్రహం గుర్తించిన స్థానికులు విషయాన్ని హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అర్చకులు సతీష్ శాస్త్రితో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి, పసుపుకుంకుమలను సమర్పించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
News November 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


