News April 16, 2025
కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.
Similar News
News January 6, 2026
వాట్సాప్లో తిరుమల సమాచారం!

AP: తిరుమల వెళ్లే భక్తులు వాట్సాప్ ద్వారా పలు సేవలు పొందొచ్చు. 9552300009 నంబరుకు వాట్సాప్లో Hi అని మెసేజ్ పంపితే పలు రకాల సమాచారాన్ని టీటీడీ అందిస్తోంది. సర్వ దర్శన స్లాట్ల స్టేటస్, ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయి?, అందుబాటులో ఉన్న శ్రీవాణి టికెట్లు, కాషన్ డిపాజిట్ రిఫండ్ ట్రాకింగ్ స్టేటస్ తదితర సేవలు అందుతాయని టీటీడీ పేర్కొంది.
News January 6, 2026
హనుమంతుడి పాదాలను తాకకూడదా?

హనుమంతుడు నిత్య బ్రహ్మచారి కావడంతో ఆయన విగ్రహాన్ని, పాదాలను మహిళలు తాకకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆయన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నియమం అమలులో ఉంది. అలాగే మహిళలు స్వామివారికి అభిషేకం చేయడం, పంచామృతాలు, వస్త్రాలు సమర్పించడం వంటివి కూడా నేరుగా చేయకూడదట. దూరం నుంచి దర్శించుకుని, భక్తితో నమస్కరించాలని సూచిస్తారు. మనసారా తలచుకుంటే ఆంజనేయుడు అందరినీ చల్లగా చూస్తాడు.
News January 6, 2026
భారత్లో పర్యటించనున్న జర్మనీ ఛాన్స్లర్

జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తొలిసారి భారత పర్యటనకు రానున్నారు. PM మోదీ ఆహ్వానం మేరకు ఈ నెల 12, 13 తేదీల్లో అహ్మదాబాద్, బెంగళూరులో పర్యటించనున్నారు. 12వ తేదీ ఆయనకు PM మోదీ స్వాగతం పలకనున్నారు. జర్మనీ-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి గతేడాదితో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.


