News April 12, 2025
కొత్తగూడెం: ‘యువ వికాసం అప్లికేషన్లు అందజేయండి’

జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల్లో నేటి నుంచి 3 రోజులు వరకు రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ పత్రాలు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించే అధికారులు, సిబ్బంది రెండో శనివారం, ఆదివారం, సోమవారం అందుబాటులో ఉంటారని తెలిపారు. కాగా సాంకేతిక కారణాల వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేదని మరికొంత సమయం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News December 8, 2025
ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ నెల 11న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరగనున్న పోలింగ్–కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, తాగునీరు, ర్యాంపులు, విద్యుత్ వంటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 8, 2025
టుడే హెడ్ లైన్స్

✪ నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి సమ్మిట్ తర్వాత మరో లెక్క: సీఎం రేవంత్
✪ ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం
✪ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు
✪ 15 ఏళ్లు కూటమిదే అధికారం: లోకేశ్
✪ DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR
✪ గోవాలోని నైట్ క్లబ్లో అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
✪ పెళ్లి రద్దయినట్లు ప్రకటించిన భారత క్రికెటర్ స్మృతి
News December 8, 2025
శరీరానికి కాపర్ అందితే కలిగే లాభాలు ఇవే!

శరీరానికి అవసరమైన కాపర్ అందితే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మతిమరుపు దరిచేరదు. వృద్ధులకు అల్జీమర్స్ ప్రమాదం ఉండదు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు, ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. క్యాన్సర్ సెల్స్ నాశనమవుతాయి. బాడీలో నుంచి ఫ్రీ రాడికల్స్ బయటకుపోతాయి.


