News October 23, 2024
కొత్తగూడెం: రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం: కూనంనేని

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికీ ఒకే అజెండా ఉందని, అందుకే ఈ ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వారి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారని, రాబందుల్లా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యానించారు.
Similar News
News October 26, 2025
ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

HYDలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.

ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్‌లో బిజీ

జూబ్లీహిల్స్‌లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.