News January 28, 2025

కొత్తగూడెం: రైతు భరోసా నిధులు జమ

image

కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాల రైతులకు రైతు భరోసా లభించింది. సోమవారం నాటికి మొత్తం 22,125 మంది రైతులకు 39.07 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన రైతులకు దశలవారీగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. 

Similar News

News February 8, 2025

శ్రీ సత్యసాయి జిల్లా మహిళలకు గుడ్‌న్యూస్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని మహిళలకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహిళలకు కుట్టు మెషీన్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. జిల్లా మహిళలకు శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ వద్ద ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News February 8, 2025

శివరాత్రికి అఖండ-2 ఫస్ట్ లుక్?

image

బోయపాటి డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా అఖండ-2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే మహాకుంభమేళాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను ఈ నెలాఖరున విడుదల చేస్తారని సమాచారం. ఈ మూవీలో సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News February 8, 2025

ధర్మపురి: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!