News May 22, 2024

కొత్తగూడెం: రోడ్డుప్రమాదాల్లో ముగ్గురి మృతి

image

వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనలు కొత్తగూడెం జిల్లాలో జరిగాయి. దమ్మపేట పట్వారిగూడెం కూడలి వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టడంతో కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కొన్ని గంటలకు ముందు పట్వారిగూడెంలో బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News December 4, 2025

ఖమ్మం: 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా

image

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 22.150 కేజీల గంజాయితో పట్టుబడిన రాజస్థాన్‌కు చెందిన భాగ్ చంద్ బైర్వా (A1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

News December 4, 2025

ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

image

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

News December 4, 2025

ఖమ్మం: స్కూటీని ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

image

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డోర్నకల్‌కు చెందిన మునగల వీరభద్రం(55) స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.