News June 25, 2024
కొత్తగూడెం: వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణి వ్యాప్తంగా ఓసీల్లో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రోజుకు 1.60 లక్షల టన్నులకు గాను 1.10లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదైంది. కొత్తగూడెం రీజియన్లోని ఇల్లెందులో 11వేల టన్నులకు గాను 6వేల టన్నులు, కొత్తగూడెం ఏరియాలో 40వేల టన్నులకు 30వేలు, మణుగూరు ఏరియాలో 35వేల టన్నులకు గాను 25వేల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 17, 2025
ఖమ్మం డీసీసీ.. ఆ నలుగురిలో ఎవరో..?

ఖమ్మం DCC అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. భట్టి, పొంగులేటి వర్గాల నేతలు పీఠంపై కన్నేశారు. పార్టీ నిబంధనల కారణంగా కొత్తగా చేరిన వారికి అవకాశం లేకపోవచ్చు. 56 దరఖాస్తుల్లో నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మద్ది శ్రీనివాస రెడ్డి, మానుకొండ రాధాకిషోర్ తుది జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం టీహబ్లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


