News March 21, 2024
కొత్తగూడెం: విద్యార్థినులను దత్తత తీసుకున్న ఎస్సై
తల్లిదండ్రులను కోల్పోయినా విద్యలో రాణిస్తున్న ఇద్దరు పేద విద్యార్థినులను దత్తత తీసుకుని, వారి చదువుల బాధ్యతను చర్ల ఎస్సై టీవీఆర్.సూరి స్వీకరించారు. చర్లలోని కస్తూర్భా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పదో తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనిత, తల్లిని కోల్పోయిన శిరీష పరిస్థితి తెలుసుకుని చలించారు. వారు ఎంత వరకు చదివినా తనదే బాధ్యత అని తెలిపారు.
Similar News
News September 11, 2024
నేడు ఖమ్మం జిల్లాకు రానున్న కేంద్ర బృందం
మున్నేరు, ఆకేరు, పాలేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఖమ్మం జిల్లాకు రానుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు 9 మందితో ఈ బృందం నేడు ఢిల్లీ నుంచి వస్తోంది. ఈ బృందంలోని అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నష్టాన్ని పరిశీలిస్తారు. ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నెస్పీ కాలువలు, వంతెనలను పరిశీలించనుంది.
News September 11, 2024
దుమ్ముగూడెం: తూరుబాక ప్రధాన రహదారిలో రాకపోకలు బంద్
దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.
News September 11, 2024
ఖమ్మం జిల్లాలో 15వేల ఎకరాల్లో పంటనష్టం
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన సర్వే ఓ కొలిక్కి వస్తోంది. సర్వేలో భాగంగా 12,014 మంది రైతులకు చెందిన 15,058 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు మంగళవారం నాటికి గుర్తించారు. ఇందులో వరి 10,844 ఎకరాలు ఉంది. మధిర, కూసుమంచి మండలాల్లో సర్వే కొనసాగుతుండగా మరో రెండు, మూడు రోజుల్లో నష్టంపై స్పష్టత రానుంది.