News March 4, 2025

కొత్తగూడెం: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

నరసరావుపేట కలెక్టరేట్‌లో సర్దార్ పటేల్ జయంతి

image

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ కృత్తికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News October 31, 2025

HYD సంస్థానం గురించి తెలుసా?

image

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్‌జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.

News October 31, 2025

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <>షెడ్యూల్ <<>>విడుదల చేసింది. రోజుకు 2 సెషన్స్(9AM-12PM, 2PM-5PM)చొప్పున FEB 2-21 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ENG ప్రాక్టికల్స్ ఉంటాయి. FEB 25-MAR 18 వరకు రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్‌ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.