News August 18, 2024
కొత్తగూడెం వైద్య కళాశాలలో ఇంటర్వ్యూలు

కొత్తగూడెం వైద్య కళాశాలలో 19 క్యాటగిరీలలో 105 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రాజకుమార్ తెలిపారు. ప్రొఫెసర్లు 10, అసోసియేట్ ప్రొఫెసర్ 35, అసిస్టెంట్ ప్రొఫెసర్ 16, ట్యూటర్లు 22, సీనియర్ రెసిడెంట్లు 22 మందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఐడీవోసీలో కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News December 13, 2025
ఖమ్మం: క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పరిశీలించిన సీపీ

ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. రూరల్ మండలంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 1,059 కేసుల్లో 7,129 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News December 13, 2025
ఐటీఐలో సోలార్ ఎనర్జీపై 10 రోజుల శిక్షణ

ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో డా. రెడ్డీస్, CSDసంయుక్త ఆధ్వర్యంలో 10రోజుల సోలార్ ఎనర్జీ శిక్షణ కార్యక్రమం ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. SSC, ITI(ఎలక్ట్రీషియన్), డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News December 13, 2025
ఖమ్మం: భార్యాభర్తలే సర్పంచ్, ఉప సర్పంచ్

బోనకల్ పంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మంగమ్మపై 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళా కావడంతో సతీమణిని బరిలో నిలిపి, సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సీపీఎం తరఫున జడ్పీటీసీగా గెలిచారు.


