News December 19, 2024
కొత్తగూడెం: సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన కేఏ పాల్

కొత్తగూడెంలో కేఏ పాల్ సమగ్ర శిక్షా ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కలెక్టరేట్ సమీపంలో ధర్నా నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆకస్మికంగా రోడ్డుపైన కేఎ పాల్ కనపడడంతో జనం ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మణుగూరు సమీపంలోని పగిడేరులో ప్రజాశాంతి పార్టీ సమావేశానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News July 8, 2025
ఖమ్మం: 15 పాఠశాలలకు రూ.12 కోట్ల నిధులు

ఖమ్మం జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
News July 8, 2025
‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.
News July 8, 2025
15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్

జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, దీనికి అవసరమైన పటిష్ఠ ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యా శాఖ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధిరలో జి+2 మోడల్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.