News August 18, 2024
కొత్తగూడెం: సింగరేణి కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా శ్రీనివాస్

సింగరేణి సంస్థ కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జీఎంగా ఉన్న గురువయ్య జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఆర్-1 జీఎంగా ఉన్న శ్రీనివాస్‌ను నియమించారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఆయన మాట్లాడుతూ.. విలువైన కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రమాదాల సంఖ్య తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, స్వీయరక్షణపై అందరూ దృష్టి సారించాలన్నారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారా.. జైలుకే..!

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ, పల్లెల్లో డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలు జోరందుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే ఎన్నికల్లో ఇటువంటి చర్యలు నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 ప్రకారం, ఎన్నికల వేళ ప్రలోభాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయితే, తీవ్రమైన శిక్షలతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.
News December 9, 2025
ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.