News June 14, 2024
కొత్తగూడెం: 3 సంవత్సరాల్లో రూ.84 కోట్ల గంజాయి పట్టివేత

భద్రాచలం మీదుగా MH, తమిళనాడు, ఢిల్లీకి నిత్యం గంజాయి తరలిపోతోంది. 2021లో 74 కేసులు నమోదు చేసి 16,146 కిలోలు, 2022లో 50 కేసులు పెట్టి 24,000 కిలోలు, 2023లో 74 కేసులు నమోదు చేయడం ద్వారా 5,244 కిలోల, 2024లో మార్చి నాటికి 35 కేసులు పెట్టి 2,781 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో రూ.84 కోట్ల విలువ చేసే గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 33,400 కిలోల గంజాయిని కాల్చారు.
Similar News
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.
News December 5, 2025
ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.
News December 5, 2025
కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.


