News January 23, 2025

కొత్తగూడెం: AAI అధికారుల పర్యటన

image

కొత్తగూడెంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కేంద్ర బృందం గురువారం పర్యటించింది. చుంచుపల్లి, సుజాతనగర్, పాల్వంచ మండలాలలో ఎయిర్ పోర్ట్ కోసం అనువైన స్థలాలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌తో పాటు కేంద్ర ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలిస్తోంది. 

Similar News

News October 28, 2025

కరీంనగర్: SU Bsc Honours పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

SU పరిధిలో జరుగనున్న Bsc Honours, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 1వ, 2వ, 3వ సెమిస్టర్, బయో మెడికల్ సైన్స్ కోర్సులో 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 4 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు నవంబర్‌లో జరుగుతాయని పేర్కొన్నారు.

News October 28, 2025

మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.

News October 28, 2025

తూ.గో: సార్.. ఈ సమస్యలను పరిష్కరించండి

image

తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో మంగళవారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ‘మీ ఏరియాలో కరెంట్ ఉందా? లేదా?’ అంటూ Way2Newsలో ప్రచురితమైన వార్త కింద <<18131522>>కామెంట్ల <<>>రూపంలో ప్రజలు తమ సమస్యలను వివరించారు. వీటిపై ఆయా ప్రాంతాల అధికారులు స్పందించాలని కోరుతున్నారు.