News February 2, 2025
కొత్తగూడ: పురుగు మందు తాగి ఆత్మహత్య

కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధి బోరింగ్ తండాకు చెందిన భూక్య లింగయ్య (55) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతుడు లింగయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామని, ఇంటికి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలో కడుపు నొప్పి భరించలేక పురుగు మందు తాగినట్లు తెలిపారు.
Similar News
News February 27, 2026
మార్చిలో తిరుమలలో విశేష పర్వదినాలు

☞ మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి ☞ 3న కుమారధార తీర్థ ముక్కోటి, చంద్ర గ్రహణం కారణంగా ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత ☞ 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ☞ 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ☞28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ☞30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.
News February 27, 2026
తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్లైన్లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
News February 27, 2026
జగిత్యాల: బడి పిల్లల కథా రచనలకు ఆహ్వానం: DEO

JGTL జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు DEO రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథా రచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు. మార్చి15లోగా DEO కార్యాలయానికి పంపాలన్నారు. సుగుణాకర్, స్వామి పాల్గొన్నారు.


