News February 28, 2025
కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Similar News
News March 1, 2025
శ్రీకాళహస్తిలో శివపార్వతుల కళ్యాణోత్సవం

AP: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సుందరంగా అలంకరించి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఇదే కళ్యాణ ఘడియలో వందకు పైగా జంటలు మనువాడాయి. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో తాళిబొట్లు, ఇతర పెళ్లి సామగ్రి ఉచితంగా అందించారు.
News March 1, 2025
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన మామిడి పెంటయ్య శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్ఐ జయంతి తెలిపారు. మృతుడి బార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. తరచు తాగి వస్తుండటంతో ఇలా అయితే మీ ఆరోగ్యం చెడిపోతుందని భార్య మందలించడంతో మనస్తాపం చెంది, అశరబంద చెరువు వద్ద పురుగు మందు తాగినట్లు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బొండపల్లి వద్ద చనిపోయినట్లు పేర్కొన్నారు.
News March 1, 2025
గుంటూరు: 80 ఏళ్ల వయస్సులో మూడు బంగారు పతకాలు

గుంటూరుకు చెందిన దివాకర్(80) ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన 80 సంవత్సరాల స్పోర్ట్స్ మీట్లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హేమర్, జావలిన్, డిస్క్ త్రోలో వరుసగా మూడు బంగారు పథకాలను సాధించారు. గుంటూరు ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో అనంతపూర్‌లో జరిగిన పోటీలలో కూడా 3 బంగారపు పతకాలను కైవసం చేసుకున్నాడు. దీంతో ఈయనను పలువురు అధికారులు అభినందించారు.