News December 6, 2024

కొత్తపట్నం బీచ్ వద్ద చిన్న సైజు విమానం

image

కొత్తపట్నం తీరప్రాంతంలో చిన్న సైజులో ఉన్న గల ఓ విమానాన్ని మెరైన్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో ఈ పరికరం పడింది. విషయం తెలుసుకున్న మెరైన్ సీఐ, ఎస్సైలు గస్తీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రాజు, రామిరెడ్డి, హోంగార్డు లక్ష్మణ్‌లు తీరానికి వెళ్లి మత్స్యకారుల నుంచి ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News November 16, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.

News November 15, 2025

ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

image

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

News November 15, 2025

ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

image

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.