News August 3, 2024
కొత్తపట్నం: KGBV ప్రత్యేక అధికారి, ANMపై వేటు

కొత్తపట్నం మండలం పాదర్తి-మోటుమాల గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో, రెండురోజుల క్రితం ఇంటర్ బాలిక ప్రసవించిన ఘటనపై కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు కలెక్టర్ ఆదేశించటంతో ప్రత్యేకాధికారి వి అరుణ కుమారి, ఏఎన్ఎం జె సత్యవతిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ డీఈవో సుభద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 4, 2026
పారిశుద్ధ్య కార్మికులకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

కొండపి, టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం మంత్రి స్వామి ఒంగోలు కలెక్టరేట్ ఆవరణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ మల్లికార్జున్ ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు ఈ ఆటోలు ఉపయోగపడతాయన్నారు.
News January 4, 2026
ఫేక్ లోన్ యాప్ల పట్ల ప్రజలు భద్రం: ఇన్ఛార్జ్ SP

ఫేక్ లోన్ యాప్ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డాటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.