News March 15, 2025
కొత్తపల్లి: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తపల్లి మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం సరైన సమయానికి అందుతుందా లేదా అని ఆరా తీశారు. అల్పాహారం నాణ్యత లేకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. తద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు.
Similar News
News March 16, 2025
గంజాయి అక్రమ రవాణాపై నిఘా: ఎస్పీ

గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తే నేరంగా పరిగణించి చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతోందన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
News March 16, 2025
కదిరి నరసింహ స్వామి సేవలో కలెక్టర్

కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లగా ఆలయ అర్చకులు కలెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.
News March 16, 2025
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు అమరజీవి

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అసువులు బాసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కరరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు.