News April 10, 2025

కొత్తపల్లి: బెట్టింగ్‌లో నష్టం రావడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

image

బెట్టింగ్ యాప్‌లో నష్టం రావడంతో యూ.కొత్తపల్లి(M) రామన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సూరిబాబు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని గేమ్ ఆడి రూ.కోటి 50లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులవడంతో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబీకులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

Similar News

News December 8, 2025

జగిత్యాల: బస్సు ఛార్జీలు ఇస్తాం.. వచ్చి ఓటేయండి

image

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కావడంతో ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాలలో ఉంటే వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తనకు ఓటు వేసి వెళ్తే బస్సు ఛార్జీలు ఇస్తామని, వచ్చి ఓటేయండని ప్రాధేయపడుతున్నారు. దీంతో వస్తామని కొందరు, ఒక్క ఓటు కోసం ఏం వస్తాంలే అని మరికొందరంటున్నారు.

News December 8, 2025

ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

image

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్​ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.

News December 8, 2025

ప్లానింగ్ లేకపోవడం వల్లే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్

image

సిబ్బంది రోస్టర్లు, అంతర్గత ప్లానింగ్ వ్యవస్థలో సమస్యల వల్లే ఇండిగో విమానాల సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘కఠినమైన సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CARs) అమలులో ఉన్నాయి. వాటిని ఎయిర్‌లైన్ ఆపరేటర్లు పాటించాలి. ఈ రంగంలో నిరంతరం సాంకేతికత అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దేశంలో విమానయాన రంగానికి ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాలనేదే మా విజన్’ అని రాజ్యసభలో తెలిపారు.